-ఆనారోగ్యానికి కేరాఫ్ పుంగనూరు మున్సిపాలిటి
- ఫిర్యాదులపై స్పందన లేని అధికారులు
- విరివిగా హోటళ్లలో ప్లాస్టిక్ వినియోగం
- ఆహారంలో కెమికల్స్
పుంగనూరుముచ్చట్లు:
స్వచ్చాంధ్ర , స్వర్ణాంధ్ర, ఆపరేషన్ క్లీన్‌స్వీప్ పేర్లతో ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు షోలకు మాత్రమే అనడానికి నిదర్శనంగా పుంగనూరు మున్సిపాలిటిలో అధికారుల పనితీరు నిలుస్తోంది. ఆలస్యంగా తెలిసిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
పట్టణంలోని ఎంబిటి రోడ్డులో మసీదుకు ఎదురుగా ఉన్న అల్పాహార హోటల్‌లో బాబు అనే వ్యక్తి రెండు దోసెలను మంగళవారం రాత్రి కొనుగోలు చేశాడు. ఈ దోసెలను హోటల్ వారు ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి ఇచ్చారు. ఇంటికి చేరుకుని తిందామని పొట్లం విప్పి చూడగా దోసెలు కవర్లపై ఉన్న కెమికల్ రంగుతో మారిపోయింది. తినలేక పడేయాల్సి వచ్చింది. హోటల్ యజమానిని అడుగుగా దురుసుగా సమాధానం ఇచ్చాడు.
ఫిర్యాదుపై ఒకరిపై ఒకరు…..
ఆహార పదార్థాలలో ప్లాస్టిక్ వినియోగంతో కెమికల్స్ రావడంపై బాధితుడు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి కి ఫిర్యాదు చేశారు. ఆయన ఆహారానికి సంబంధించి తమ పరిధిలో లేదని , అన్నమయ్య జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితుడు ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వారు పుంగనూరు అన్నమయ్య జిల్లా పరిధిలోకి రాలేదని , చిత్తూరు వారిని సంప్రదించాలని సూచించారు. దీనిపై బాధితుడు చిత్తూరు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అక్కడి ఫుడ్ ఇన్‌స్పెక్టర్ గురులక్ష్మీ స్పందించి ప్లాస్టిక్ వినియోగం మున్సిపాలిటి పరిధిలోకి వస్తుందని, ఆహారంలో కల్తీలు ఉంటే తాము చర్యలు తీసుకుంటామని, దీనిపై మున్సిపల్ కమిషనర్ కు లేఖ రాస్తామని తెలిపారు. కానీ ఇది తమ పరిధిలోకి రాదంటు ఒకరిపై మరొకరు వేసుకోవడం హాస్యాస్పదం. దీనిపై బాధితుడు మాట్లాడుతూ ఆహార పదార్థాలలో ప్లాస్టిక్ వినియోగంతో ప్రజలు ఆనారోగ్యం భారీన పడతారని , ఈ విషయానికి ప్రాధాన్యత ఇవ్వని కమిషనర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లపై కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేసి , న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
విరివిగా ప్లాస్టిక్ వినియోగం…..
పట్టణంలోని టి హోటళ్లు, భోజన శాలలో విరివిగా ప్లాస్టిక్ వినియోగం సాగుతోంది. విచ్చలవిడిగా ప్లాస్టిక్ విక్రయాలు సాగుతున్న అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టేస్తున్నారు. ఆహార పదార్థాలకు కవర్ల పై ఉన్న కెమికల్ రంగు దోసె, ఇడ్లీలలో అతుక్కుని రంగు మారి వాటిని ప్రజలు తినడంతో తీవ్రమైన ఆనారోగ్యానికి గురౌతున్నారని, ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్లాస్టిక్, కవర్ల వినియోగాన్ని అధికారులు ఎందుకు నిషేధించరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Tags: If you eat at the hotels in Punganur… you’re done for…