పుంగనూరుముచ్చట్లు:
నిత్యజివితంలో యోగా చేసే వారి జీవితం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుందని , ప్రతి ఒక్కరు యోగా చేయడం అలవర్చుకోవాలని సీనియర్ సివిల్‌జడ్జి ఆరీఫాషేక్ తెలిపారు. ఆదివారం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి పరేష్‌కుమార్, అడిషినల్ జూనియర్ సివిల్‌జడ్జి కృష్ణవంశి ,న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి యోగా మాస్టర్లు అనిత, బాలసుబ్రమణ్యం సూచనల మేరకు యోగా నిర్వహించారు. అలాగే మున్సిపాలిటిలో కమిషనర్ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో యోగా చేశారు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి పాఠశాలలో డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు యోగా చేశారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో యోగా కార్యక్రమాలను నిర్వహించారు.

Tags; Health is secured through yoga – Justice Arifa Shaik.