తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి సంబంధించి టీటీడీ ప్రతిరోజూ తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.టీటీడీ ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ చేస వేళల్లో మార్పులు చేశారు. మొన్నటి వరకు వేసవి సెలవుల కారణంగా రద్దీ కనిపించింది.. అందుకే ఇప్పటివరకు అర్ధరాత్రి సమయంలో టోకెన్లు జారీ చేసేవారు. ప్రస్తుతం రద్దీ తగ్గుముఖం పట్టడంతో టోకెన్ల జారీ వేళల్లో మార్పులు చేశారు.. శుక్రవారం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకే జారీ ప్రక్రియను ప్రారంభించారు. టీటీడీ అధికారులు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో భక్తులకు 12 వేల టోకెన్లను జారీ చేశారు. ఇటు శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన వెళ్లే భక్తుల కోసం మరో 2 వేల టోకెన్లు అందజేశారు. భక్తులు ఆధార్ కార్డు చూపించి భక్తులు ఈ టోకెన్లు తీసుకోవచ్చు.
అమ్మవారి తెప్పోత్సవాలు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను టీటీడీ జేఈవో డా ఏ శరత్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆలయ అధికారులతో కలిసి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, దర్శన సౌకర్యాలు తదితర అంశాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెప్పోత్సవాల్లో వినియోగించే తెప్పల ఫిట్‌నెస్‌ను పూర్తిగా పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించాలని జేఈవో సూచించారు. అలాగే విద్యుద్దీపాల కాంతులతో, పుష్పాల అలంకరణలతో తెప్పలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జేఈవో తెలిపారు. ఈ కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచనున్నాయని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పద్మావతి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని జేఈవో భక్తులను కోరారు.
జూన్ 25న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి తెప్పోత్సవం, జూన్ 26న శ్రీ సుందరరాజస్వామివారి తెప్పోత్సవం, జూన్ 27 నుంచి 29 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. గజవాహన, గరుడవాహన సేవలు ప్రత్యేక ఆకర్షణ. జూన్ 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవ, జూన్ 29వ తేదీ రాత్రి 8.30 గంటలకు గరుడవాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తనుంది.
Tags: Change in timings for the issuance of Tirumala free darshan tokens