June 20, 2026
Explore
చుక్కల భూములకు సంబంధించి కీలక ప్రకటన

చుక్కల భూములకు సంబంధించి కీలక ప్రకటన

June 20, 2026 | Andhra Pradesh

10-15 రోజుల్లో చుక్కల భూములకు విముక్తి

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. చుక్కల భూములకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. త్వరలో 1.90 లక్షల ఎకరాల చుక్కల భూమికి విముక్తి కల్పిస్తామన్నారు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.
10-15 రోజుల్లో చుక్కల భూములకు విముక్తి లభిస్తుంది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్పష్టమైన యాజమాన్య హక్కులు లేకుండా రెవెన్యూ రికార్డుల్లో యజమాని కాలమ్‌లో చుక్కలు పెట్టి భూముల్ని వదిలేశారు.. ఈ భూముల్ని చుక్కల భూములుగా పిలుస్తారు. ఈ భూమి ప్రభుత్వానిదా, ప్రైవేట్ వ్యక్తులదా అనేది స్పష్టత లేకపోవడంతో వివాదాలు ఉన్నచోట అధికారులు చుక్కలు పెట్టారు. ఈ భూములపై ఎవరికి హక్కులు ఉన్నాయో క్లారిటీ లేకపోవడంతోనిషేధిత జాబితాలో చేర్చింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నాని తెలిపారు. గత రెండేళ్లలో రెవెన్యూశాఖలో కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలు, లక్ష్యాలను వివరించారు. భూములు, రిజిస్ట్రేషన్లు, రీసర్వేకు సంబంధించి ఇబ్బందులు తొలగిపోయాయి అన్నారు. రీసర్వే 2.0ను నిర్వహించి భూ యజమానులు పాస్‌ పుస్తకాలకు జారీ చేశామన్నారు. అలాగే 1.33 లక్షల ఎకరాల గ్రామ సర్వీస్‌ ఇనాం భూములకు విముక్తి కల్పించామన్నారు. ఇతర భూ సమస్యల్ని కూడా పరిష్కరించామన్నారు. త్వరలో ఫ్రీహోల్డ్‌ సమస్యను పరిష్కరిస్తామని.. 22ఏపై గతంలో ఇచ్చిన మెమో కన్నా ఇంకా బెటర్‌ మెమో ఇస్తామన్నారు.

అధికారులు ఓ గ్రామానికి నెలలో నాలుగు రోజులు వెళ్లి అక్కడ ప్రజల సమస్యలు పరిష్కించేలా కార్యక్రమం చేపట్టామన్నారు మంత్రి అనగాని. గత ప్రభుత్వ హయాంలో రీసర్వే చేయించగా.. ఈ భూములకు సంబంధించి ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా 7.5 లక్షల ఫిర్యాదులు వచ్చాయన్నారు. అందుకే రీసర్వే చేసిన తర్వాత భూహక్కుదారుల ఈకేవైసీ తీసుకుని పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తున్నాము అన్నారు. ఈ పాస్‌బుక్‌లపై రాజముద్ర, హక్కుదారు ఫోటో, ఖాతా నంబర్, క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసి ఇస్తున్నామన్నారు. అన్‌సెటిల్డ్‌ ఎస్టేట్, ఇనామ్‌ భూముల సమస్యల్ని పరిష్కరించామన్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలు చేస్తున్నామని.. కేవలం 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేస్తున్నామన్నారు.

ఒకవేళ తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తే వాటిని రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇచ్చామన్నారు మంత్రి సత్యప్రసాద్. గతంలో జరిగిన తప్పుడు రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేసే అధికారం కూడా ఇస్తామన్నారు. ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి స్పెషల్ సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చి పరిశీలిస్తున్నాము అన్నారు. అలాగే రాష్ట్రంలో భూమల మార్కెట్ ధర పెంచే ప్రతిపాదన లేదన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఎకరా 99 పైసలకే భూములు ఇచ్చామన్నారు. అందుకే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.

Tags: Key Announcement Regarding ‘Chukka Lands’