పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని సూర్యనగర్‌లో గల నారాయణ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం పుస్తకాలు, బ్యాగులను చట్టవిరుద్ధంగా విక్రయించడంపై విద్యార్థి సంఘాలు ధర్నా చేశారు. శనివారం ఏఐఎస్‌ఎఫ్ , ఓబిసి సంఘాల నాయకులు నారాయణ స్కూల్‌లో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పుస్తకాలు, బ్యాగులతో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ధర్నాలో ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు మున్నా మాట్లాడుతూ పట్టణంలోని బాష్యం, నారాయణ, చైతన్య పాఠశాలలో పుస్తకాల పేరుతో విద్యార్థులను, తల్లిదండ్రులను దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ రమణ ఆధ్వర్యంలో పోలీసులు వెళ్లి విద్యార్థుల ధర్నాను విరమింప చేశారు. ధర్నాలో సురేష్ యాదవ్, విక్రమ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Student unions stage a protest at Narayana School.