సోమల ముచ్చట్లు:
సోమల మండలం లింగాపురంగుట్టలో ఎస్‌ఐఆర్ నమోదు కార్యక్రమాన్ని వైఎస్సార్‌సిపి నాయకులు పకడ్భంధిగా నిర్వహించారు. శనివారం మండల పరిశీలకుడు , జెడ్పిటిసి రెడ్డీశ్వర్‌రెడ్డి, ఎంపిపి ఈశ్వరయ్యతో కలసి ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణీ చేశారు. ఓటర్ల నమోదు , మార్పులు, చేర్పులపై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ఇందులో వైస్ ఎంపిపి ప్రభాకర్, పార్టీ మండల నాయకులు గంగాధర్, నాగేశ్వరరావు, సాంబయ్య, రమణ, రెడ్డి, వెంకట్రమణ, నాగభూషణంరెడ్డి, శ్రీరాములు, షేక్‌బాష, షాహీద్, రాజారెడ్డి, గురుప్రసాద్, శరత్‌బాబు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags: SIR Program in Somala