పుంగనూరుముచ్చట్లు:
ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న (స్పెషల్ ఇన్‌సెన్‌టివ్ రివిజన్ )ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో నిర్లక్షంతో ఓట్లు పోగొట్టుకోరాదని వైఎస్సార్‌సిపి నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి కోరారు. శనివారం ఎంపిపి భాస్కర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్దిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, జిల్లా యూత్‌వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డిలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆధికార పార్టీ వైఎస్సార్‌సిపి ఓట్లు తొలగించే కుట్రపన్నుతోందన్నారు. ముఖ్యంగా మైనార్టీ ఓట్లను గల్లంతు చేసే అవకాశం ఉందన్నారు. పార్టీ బిఎల్‌వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణీ చేసి వాటిని పకడ్భంధిగా ప్రభుత్వ బిఎల్‌వోల ద్వారా నమోదు కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇందులో నిర్లక్షం చేయరాదని కోరారు. ఎలాంటి అక్రమాలు జరిగిన తక్షణమే సంబంధిత ఇన్‌చార్జ్లకు ఫిర్యాదులు చేయాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ, మండల కన్వీనర్లు ఇర్ఫాన్, అమరనాథరెడ్డి, ఎంపిటిసి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కార్యదర్శి జయరామిరెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి నూర్‌అహమ్మద్, కృష్ణమూర్తి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Don’t Lose Your Vote Through Negligence