పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్ర లీగల్ సర్వీసస్ అథారిటి ఆదేశాల మేరకు జూలై 11న జాతీయ లోక్‌అదాలత్ జరుగుతుందని, ఇందులో అధిక కేసులు పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీనియర్ సివిల్‌జడ్జి ఆరీఫాషేక్ కోరారు. శనివారం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి పరేష్‌కుమార్ , అడిషినల్ జూనియర్ సివిల్‌జడ్జి కృష్ణవంశి తో కలసి ఆమె పోలీసులతో సమావేశం నిర్వహించారు. జాతీయ లోక్‌అదాలత్‌లో సివిల్ , క్రిమినల్ కేసులతో పాటు లోక్‌అదాలత్ పరిధిలోని కేసులను పరిష్కరిస్తామన్నారు. న్యాయవాదులు , అధికారులు , పోలీసులు సమన్వయం చేసుకుని అత్యధిక సంఖ్యలో కేసులు పరిష్కారానికి కృషి చేసి, కక్షిదారుల్లో స్నేహపూర్వక వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు వారికి అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు అన్సర్‌బాషా, చిన్నరెడ్డెప్ప, భాస్కర్, రమేష్‌కుమార్, రుషికేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Make the National Lok Adalat on July 11 a success.