తిరుమల ముచ్చట్లు:
తిరుమలకు దర్శనార్థం వచ్చిన తెలంగాణకు చెందిన భక్తుడు వంగ మల్లేష్ గౌడ్ అలిపిరి చెక్‌పాయింట్ (స్కానర్) వద్ద తన బ్యాగును అనుకోకుండా మరచిపోయారు. వెంటనే ఆయన తిరుపతి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఫిర్యాదు చేయగా, సిబ్బంది సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా బ్యాగును తీసుకెళ్లిన వాహనం (TG 07 AD 0269)ను గుర్తించి, తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.దీనితో మల్లేష్ గౌడ్ రాత్రి 11:30 గంటలకు తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సిబ్బంది వాహనాన్ని ట్రేస్ చేసి, తెల్లవారుజామున 3:30 గంటలకు బాలాజీ గెస్ట్ హౌస్ నెం.4 వద్ద ఆ వాహనంలోని భక్తులను గుర్తించారు.వారిలో లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, స్కానింగ్ సమయంలో పొరపాటున ఆ బ్యాగు తమ వద్దకు వచ్చిందని, స్వామివారి దర్శనం కోసం వచ్చినట్లు తెలిపారు.
అనంతరం బ్యాగును పరిశీలించగా అందులోని అన్ని వస్తువులతో పాటు 50 గ్రాముల బంగారం కూడా యథాతథంగా ఉండటంతో, బ్యాగును వంగ మల్లేష్ గౌడ్‌కు అప్పగించారు.ఈ సందర్భంగా భక్తుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది చొరవ, అప్రమత్తతకు కృతజ్ఞతలు తెలిపారు.
Tags: Lost bag returned to devotee through the initiative of the Command Control Center.