పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని తాటిమాకులపాళెం రోడ్డులో ఉన్న బాష్యం స్కూల్‌లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు విక్రయిస్తున్నారని ఆగదిని సీజ్ చేసినట్లు ఎంఈవో నటరాజరెడ్డి శుక్రవారం రాత్రి తెలిపారు. బాష్యం పాఠశాల హెచ్‌ఎం , ఉపాధ్యాయులు కలసి విద్యార్థుల వద్ద బలవంతంగా ఒకొక్కరి వద్ద నుంచి రూ.10,500 లు వసూలు చేస్తూ కిట్టు రూపంలో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, బ్యాగులు విక్రయిస్తున్నారని తల్లిదండ్రులు తెలపడంతో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మున్న తదితరులు పాఠశాల వద్దకు వెళ్లి నిలధీశారని , వారు ఖాతరు చేయకుండ విక్రయాలు సాగిస్తుండటంతో తమకు ఫిర్యాదు చేయడంతో వెళ్లి సాయంత్రం తనిఖీలు నిర్వహించి సీజ్ చేశామన్నారు. దీనిపై నివేదికలను జిల్లా అధికారులకు పంపి, తగు చర్యలు తీసుకుంటామన్నారు. మున్న మాట్లాడుతూ బాష్యం పాఠశాలలో అక్రమ ఫీజులు బలవంతపు వసూళ్ళు చేస్తున్నారని, ప్రస్తుతం కిట్ పేరుతో దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాష్యం పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సురేష్ యాదవ్, విక్రమ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Room selling books at Bhashyam sealed.