పుంగనూరుముచ్చట్లు:
బూత్‌లెవల్ ఏజెంట్లు ప్రతి ఇంటికి వెళ్లి ఖచ్చితమైన సమాచారంతో (స్పెషల్ ఇన్‌టెన్సువ్ రివిజన్ )ఎస్‌ఐఆర్‌ను పకడ్భంధిగా నిర్వహించాలని డీఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి బిఎల్‌వోలను ఆదేశించారు. శుక్రవారం స్థానిక జెడ్పి అతిధి గృహంలో బిఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబిత ప్రక్షాలనతో పాటు ఎన్యూమరేషన్‌ను పకడ్భంధిగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లు చేసిన , అక్రమాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్యూమరేషన్ అఫ్లీకేషన్లు పంపిణీ, నమోదు పకడ్భంధిగా నిర్వహించి, పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారు చేసేందుకు సహకరించాలని కోరారు.
Tags: The SIR must be conducted meticulously.