June 19, 2026
Explore
రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ఎంపిక

రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ఎంపిక

June 19, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఇన్‌స్పెయిర్‌ మనక్‌ పోటీల్లో జరుగుతున్న సైన్సు ప్రాజెక్టులో రెండవ లెవల్‌లో స్థానిక అడవినాథునికుంట మోడల్‌స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ రమ తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మోడల్‌స్కూల్‌ విద్యార్థులు షేక్‌మయీన్‌తాజ్‌, డి.ఉషశ్రీ లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. వీరికి గైడ్‌ గా టీచర్లు మనోహర్‌నాయక్‌, తనూజ శిక్షణలో వీరిద్దరు విద్యార్థులు మనక్‌ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సైన్సుఫేర్‌ ఆఫీసర్‌ మోహన్‌సింగ్‌ విద్యార్థులను అభినందించారు.

Tags: Two Model School students selected for state-level competitions.