పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలోని రైతులందరికి పిఎం కిసాన్ నిధులు శనివారం ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఏడి శివకుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పుంగనూరు మండలం పరిధిలోని 8606 మంది రైతులకు రూ.5.75 కోట్లు , చౌడేపల్లెలోని రైతులు 5959 మందికి రూ.4.01 కోట్లు, సోమల 6379 మందికి రూ.4.72 కోట్లు, సదుం 5514 మందికి రూ.3.82 కోట్లు, పులిచెర్ల 5596 మందికి రూ.3.74 కోట్లు, రొంపిచెర్ల 4231 మందికి రూ.2.88 కోట్లు మంజూరైందని , వీరి ఖాతాల్లో ఈ నిధులు జమౌతుందని ఆయన తెలిపారు.
Tags: PM Kisan funds to be released on the 20th.