June 19, 2026
Explore
టెలిగ్రామ్‌కు చుక్కెదురు… తాత్కాలిక నిషేధాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

టెలిగ్రామ్‌కు చుక్కెదురు… తాత్కాలిక నిషేధాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

June 19, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

        ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’కు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నీట్-యూజీ (NEET-UG) పునఃపరీక్ష నేపథ్యంలో ఈ యాప్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని కోర్టు సమర్థించింది. దేశ భద్రత, పరీక్షల సమగ్రతను కాపాడటానికి అత్యవసర పరిస్థితుల్లో ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద ప్రభుత్వం తీసుకున్న ఈ రక్షణాతీక చర్యలు పూర్తిగా నిబంధనలకు లోబడే ఉన్నాయని జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం స్పష్టం చేసింది.

dark web గా మారిన టెలిగ్రామ్
కేంద్ర ప్రభుత్వం గురువారం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో టెలిగ్రామ్ యాప్ ఒక ‘కొత్త డార్క్ వెబ్’లా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిలోని ప్రత్యేక ప్రైవసీ ఫీచర్లు, ఐడెంటిటీని దాచుకునే సదుపాయాల వల్ల సైబర్ నేరగాళ్లు, పరీక్షల పేపర్ లీక్ చేసే ముఠాలు, ఉగ్రవాద శక్తులకు ఇది ఒక సురక్షితమైన వేదికగా మారిందని కేంద్రం పేర్కొంది. పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేసి అమ్ముకోవడమే కాకుండా, టెలిగ్రామ్‌లో ఉండే మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను వాడుతూ పాత తారీఖులతో నకిలీ లీకేజీ ఆధారాలను సృష్టించి విద్యార్థులను మోసం చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్దిష్ట ఛానళ్లను మాత్రమే తొలగించడం సరిపోదని, యాప్‌ను తాత్కాలికంగా నిలిపివేయడమే సరైన మార్గమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు తాజా తీర్పుతో జూన్ 21న జరిగే నీట్ రీ-ఎగ్జామ్ ముగిసేవరకు (జూన్ 22 వరకు) దేశంలో టెలిగ్రామ్ సేవలపై నిషేధం కొనసాగనుంది.

Tags: Setback for Telegram… Delhi High Court upholds temporary ban.