June 19, 2026
Explore
ముగ్గురు కూతుర్లను హత్య చేసి, తండ్రి ఆత్మహత్య

ముగ్గురు కూతుర్లను హత్య చేసి, తండ్రి ఆత్మహత్య

June 19, 2026 | Andhra Pradesh

ప్రకాశం ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అగ్రహారం గ్రామంలో శుక్రవారం ఒక దారుణం చోటుచేసుకుంది. సుధాకర్ అనే వ్యక్తి తన కూతుళ్లు గోచిత, పూజిత, లోకితలను ఎలుకల మందు పెట్టి చంపి, ఆ తర్వాత ఇంటి వెనుక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు.

Tags: Father commits suicide after killing his three daughters.