June 19, 2026
Explore
తిరుమల దర్శనం SSD టోకెన్లు జారీ చేసే సమయం లో మార్పు

తిరుమల దర్శనం SSD టోకెన్లు జారీ చేసే సమయం లో మార్పు

June 19, 2026 | Andhra Pradesh

తిరుమలముచ్చట్లు:

తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుపతిలో SSD టోకెన్లు జారీ చేసే సమయాన్ని మార్చారు. వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నిన్నటి వరకు అర్ధరాత్రే టోకెన్లు జారీ చేశారు. వేసవి సెలవులు ముగియడంతో నేటి నుంచి యథావిధిగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య లోనే టోకన్లు ఇవ్వడం ప్రారంభిస్తారు.

తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు
తీసుకోవచ్చు.

Tags: Change in the timing of SSD token issuance for Tirumala darshan.