November 6, 2026
Explore
బాంబు బెదిరింపులతో ముంబైలో కలకలం!

బాంబు బెదిరింపులతో ముంబైలో కలకలం!

November 6, 2026 | Andhra Pradesh

అమితాబ్ ఇంటి నుంచి బాంబే హైకోర్టు వరకు..

బాంబే ముచ్చట్లు:

ఒకేసారి కీలక ప్రాంతాలే టార్గెట్‌గా ఈమెయిల్స్.. భద్రతా బలగాలు అప్రమత్తం!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసమైన ‘జల్సా’తో పాటు బాంబే హైకోర్టు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, వర్లీ రేస్‌కోర్స్‌లను పేల్చివేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్స్ రావడం ముంబైలో తీవ్ర కలకలం సృష్టించింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు. బాంబు స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువుల కోసం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ఈ బెదిరింపుల వెనుక ఎవరున్నారు? ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

నగరంలోని ప్రముఖ వ్యక్తి నివాసం, న్యాయస్థానం, ఆర్థిక సంస్థలే లక్ష్యంగా బెదిరింపులు రావడంతో ముంబై భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది.

Tags: Bomb threats cause a stir in Mumbai!