June 19, 2026
Explore
నేటి నుంచి ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్

నేటి నుంచి ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్

June 19, 2026 | Andhra Pradesh

ఇడుపులపాయముచ్చట్లు:

రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూ కేటీ) ఆధ్వర్యంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 2026 విద్యా సంవత్సరానికి సంబం ధించి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశా లకు శుక్రవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆర్కే వ్యాలీ క్యాంపస్ లోని సెంట్రల్ లైబ్రరీలో అన్ని ఏర్పాట్లు చేసి నట్లు పరిపాలనా అధికారి డాక్టర్ రవికుమార్, అకడమిక్ డీన్ రమేష్ కైలాస్ గురువారం తెలి పారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రధాన ద్వారం వద్ద సంతకం చేసి టోకెన్ తీసుకుని క్యాంపస్ లోకి ప్రవేశించాల్సి ఉంటుందని సూచించారు. ఉదయమే వచ్చే వారికి కాలకృత్యాలు తీర్చుకోడానికి వసతి గృహాల్లో ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కౌన్సె లింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు క్యాంపస్ డైరె క్టర్ విజయ్ ప్రకాశ్ ప్రారంభిస్తారని తెలిపారు.

Tags: IIIT admission counseling begins today.