June 18, 2026
Explore
వైఎస్సార్‌సిపి ఓటు ఒక్కటి తొలగించిన వదిలిపెట్టె ప్రసక్తే లేదు

వైఎస్సార్‌సిపి ఓటు ఒక్కటి తొలగించిన వదిలిపెట్టె ప్రసక్తే లేదు

June 18, 2026 | Andhra Pradesh

మాజీ ఎంపి రెడ్డెప్ప

పుంగనూరుముచ్చట్లు:

ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇన్‌టెన్సువ్‌ రివిజన్‌ ) పేరుతో వైఎస్సార్‌సిపి ఓటు ఒక్కటి తొలగించిన వదలిపెట్టే ప్రసక్తే లేదని చిత్తూరు మాజీ ఎంపి ఎన్‌.రెడ్డెప్ప హెచ్చరించారు. గురువారం పట్టణంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో కొత్తపేట , కొత్తయిండ్లు, తిరుపతిరోడ్డు ప్రాంతాలలో ఎస్‌ఐఆర్‌ నమోదు కార్యక్రమంలో ఫారంలు పంపిణీ చేసి, వాటిలో వివరాలు నమోదు చేసి బిఎల్‌వోలకు అందజేసే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈసందర్భంగా మాజీ ఎంపి మాట్లాడుతూ రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గ కేంద్రమైన పుంగనూరులో ముస్లిం ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. ఏ వర్గానికి చెందిన ఓట్లు తొలగించిన చూస్తూ ఊరుకోమన్నారు. పనికిరాని నిబంధనలు పెట్టి ఓట్లు సవరణ, తొలగింపు, నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్‌సిపికి వస్తున్న ప్రజాధరణ చూసి కూటమి ప్రభుత్వానికి వణుకు పుడుతోందని ఎద్దెవ చేశారు. అధికారులు జాగ్రత్తగా తమ విధులు నిర్వహించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఆపార్టీ నాయకులు మాటలకు తలవంచవద్దని కోరారు. నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు. జూలై 14 వరకు కొనసాగే ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సిపి నాయకులు కృష్ణారెడ్డి, బాషు, అన్సర్‌, నూర్‌, విజయ్‌, సయ్యద్‌, అస్లాంమురాధి, రఫిక్‌, ఫకృ, అప్రోజ్‌, సయీద్‌, మోహన్‌ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

Tags: There is absolutely no question of letting it slide if even a single YSRCP vote is removed.