June 18, 2026
Explore
నేటి నుంచి సచివాలయాలలో గ్రామసభలు

నేటి నుంచి సచివాలయాలలో గ్రామసభలు

June 18, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని అన్ని వార్డు సచివాలయాలలోను యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వేడేటాను గురువారం ప్రదర్శించారు. మున్సిపల్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి ఆదేశాల మేరకు 16 సచివాలయాలలోను డేటాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు కుటుంబ సభ్యుల వివరాల డేటాలను పరిశీలించాలన్నారు. శుక్రవారం ఆయా సచివాలయాల పరిధిలో గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. 20 నుంచి 26వ తేదీ వరకు గ్రామసభల్లో వచ్చిన ఫిర్యాదులపై పరిష్కారం చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకుని , తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలన్నారు.

Tags: Gram Sabhas in Secretariats start today.