మదనపల్లి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా ; అతడి పేరు మోహన కృష్ణ కాని అడ్డదారిలో డబ్బు సంపాదించాలన్న లక్ష్యంగా అమ్మాయిగా మారి మధు శ్రీ గా పేరు మార్చుకొని ప్రజలను నిలువుదోపిడీ చేసి కోట్లు గడించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని శివాజీనగర్‌కు చెందిన మోహన కృష్ణ కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి ముంబై వెళ్లి పోయి అక్కడ సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారి ఇంటికి తిరిగివచ్చాడు.
అప్పటి నుంచి చీరకట్టుతో అందంగా ముస్తాబు అవుతూ మగాళ్లకు వలపు వల విసిరి కొందరిని మోసం చేయగా, పూజలు, గుప్త నిధుల పేరుతో మరికొందరిని మోసం చేశాడు. మీ ఇంట్లో ప్రేతాత్మలు ఉన్నాయి. వాటిని తొలగిస్తానంటూ మరికొందరి వద్ద డబ్బులు వసూలు చేశాడు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన అమాయక ప్రజలను మోసం చేశాడు.
ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని పెళ్లిళ్లకు వెళ్లడం, జంటలకు దిష్టి తీసి తరవాత డబ్బులు డిమాండ్ చేయడం, డబ్బులు ఇవ్వని వారిని బూతులు తిట్టడం, శపించడం, ఎవరైనా ఎదురుతిరిగితే తన వెనుక పోలీసులు, రాజకీయనాయకులు ఉన్నారంటూ బెదిరింపులకు గురి చేయడం వృత్తిగా మార్చుకున్నాడు. మధుశ్రీ చేతిలో మోసపోయిన కొన్ని కుటుంబాలు మీడియా ముందుకు రావడంతో అసలు బాగోతం బయట పడింది. దాదాపు 13 కుటుంబాలు ఆమె మత్తులో ఉన్నాయని, వాళ్లను మోసం చేస్తూ కోట్లు దోచేసిందటూ ఓ బాధిత మహిళ ఆరోపించడం వైరల్‌గా మారింది .
Tags; Transitioned from male to female, then duped and robbed innocent people.