June 18, 2026
Explore
అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు

అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు

June 18, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్, జిల్లా ఎస్పీ ధీరజ్లకు జాతీయ ఎస్సీ కమిషన్ (ఎన్‌సీఎస్‌సీ) నోటీసులు జారీ చేసింది. మదనపల్లెకు చెందిన ప్రమీల తన తమ్ముడు రామచంద్రతో కలిసి భూ వివాదానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి రామచంద్రపై దాడి చేశారని, తనను కూడా అవమానించి బయటకు పంపించారని ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన రాకపోవడంతో జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించింది. ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ డైరెక్టర్ సుధీర్ బాబు ఈ నెల 30లోపు పూర్తి వివరణ ఇవ్వాలని కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు పంపారు.

Tags;NCSC notices to Annamayya district Collector and SP