రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి సమీపంలోని సాయి ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద గురువారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు సుమారు 70 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు రాయచోటి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
Tags: Body of unidentified elderly man found in Rayachoti