ములకలచెరువుముచ్చట్లు:
ములకలచెరువు మండలం బురకాయలకోటకు చెందిన చేనేత కార్మికుడు సోమశేఖర్ (45) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మదనపల్లెలోని బాబూ కాలనీలో మగ్గాలు నేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన సోమశేఖర్ బుధవారం రాత్రి తన భార్య చీరతో కాట్లాటపల్లి మార్గంలోని టేకు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం సమాచారం అందుకున్న తాలూకా ఎస్ఐ చంద్రమోహన్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags: Distressed over ill health… Handloom weaver commits suicide.