June 18, 2026
Explore
విద్యుత్ స్తంభం కూలి మహిళకు తీవ్ర గాయాలు

విద్యుత్ స్తంభం కూలి మహిళకు తీవ్ర గాయాలు

June 18, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. మండలంలోని పాలెంపల్లె పంచాయతీ సికారిపాలెంకు చెందిన శాంతి (30) తన చంటి బిడ్డతో కలిసి ఆధార్ కార్డు పనిమీద పాలెంపల్లె సచివాలయానికి వెళ్లింది. ఈ సమయంలో అక్కడ ఉన్న విద్యుత్ స్తంభం ఒక్కసారిగా ఆమెపై కూలిపోయింది. ప్రమాదంలో శాంతి కాలుకు తీవ్ర గాయాలై ఎముకలు విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టగా, విద్యుత్ స్తంభాల భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags: Woman critically injured after electric pole collapses