June 18, 2026
Explore
అంతరాష్ట్ర చైన్‌స్నాచింగ్ ముఠా అరెస్ట్.. 11 తులాల బంగారం స్వాధీనం

అంతరాష్ట్ర చైన్‌స్నాచింగ్ ముఠా అరెస్ట్.. 11 తులాల బంగారం స్వాధీనం

June 18, 2026 | Andhra Pradesh

సిద్దవటంముచ్చట్లు:

సిద్దవటం పోలీసులు ఇద్దరు అంతరాష్ట్ర చైన్‌స్నాచింగ్ నిందితులను అరెస్ట్ చేసి 11 తులాల బంగారం, కేటీఎం ద్విచక్ర వాహనం, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. రాజంపేట ఏఎస్పీ రామ్నాధ్ హెగ్డే తెలిపిన వివరాల ప్రకారం, భాకరాపేట వద్ద వాహనాల తనిఖీలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సిద్దవటం, ఒంటిమిట్ట, భాకరాపేట, బంగారుపాలెం, తమిళనాడులో నమోదైన పలు చైన్‌స్నాచింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తేలింది. వృద్ధులు, ఒంటరిగా ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడినట్లు వెల్లడైంది. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags: Inter-state chain-snatching gang arrested; 11 tolas of gold recovered.