June 18, 2026
Explore
భర్తతో మనస్పర్థలు.. మహిళ ఆత్మహత్య

భర్తతో మనస్పర్థలు.. మహిళ ఆత్మహత్య

June 18, 2026 | Andhra Pradesh

కె.వి.పల్లి ముచ్చట్లు:

కె.వి.పల్లి మండలం కుంటిమేకలపల్లి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మొద్దింగల సులోచన (45)కు భర్త వెంకటరమణతో మనస్పర్థలు ఏర్పడినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను గర్నిమిట్ట ఆసుపత్రికి, అక్కడి నుంచి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: Woman commits suicide following marital discord.