జంబ లకిడి పంబ…సినిమా అందరూ చూసే ఉంటారు…..అలాంటి ఘటన మన గుంటూరు లో….అరుదైన వ్యాధి…పురుషుడిలో స్త్రీ లక్షణాలు!
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన 36 ఏళ్ల వ్యక్తిలో అరుదైన కెన్నెడీ వ్యాధిని వైద్యులు గుర్తించారు. సెక్స్ హార్మోన్ల మార్పుల వల్ల పురుష లక్షణాలు తగ్గి, స్త్రీ లక్షణాలు కనిపించడం ఈ వ్యాధి ప్రత్యేకత అని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రామకృష్ణ తెలిపారు. కాళ్లు, చేతుల కండరాలు బలహీనపడటంతో ఆసుపత్రికి వచ్చిన బాధితుడికి పరీక్షలు నిర్వహించగా ఈ వ్యాధి నిర్ధారణ అయింది. 1962లో డాక్టర్ కెన్నెడీ ఈ వ్యాధిని గుర్తించారు.
Tags: Feminine traits in a man!