June 17, 2026
Explore
ఎస్‌ఐఆర్‌పై ఇంటింటా వైఎస్సార్‌సిపి శ్రేణుల కుస్తీ

ఎస్‌ఐఆర్‌పై ఇంటింటా వైఎస్సార్‌సిపి శ్రేణుల కుస్తీ

June 17, 2026 | Andhra Pradesh

పండుగల ఓటర్ల పక్రియ

పుంగనూరుముచ్చట్లు:

ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇన్‌టెన్సువ్‌ రివిజన్‌ ) కార్యక్రమంలో మూడవ రోజు వైఎస్సార్‌సిపి శ్రేణులు ఇంటింటికి వెళ్లి రివిజన్‌పై కుస్తీ పట్టారు. పట్టణంలోని 31 వార్డుల్లోను ఉమ్మడి జిల్లాల ఐటివింగ్‌ ఇన్‌చార్జ్ ప్రకాష్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, పట్టణ కన్వీనర్‌ ఇర్ఫాన్‌, మిధున్‌రెడ్డి యువసేన అధ్యక్షుడు రాజేష్‌, కార్యదర్శి జయకృష్ణ, పట్టణ మైనార్టీ నాయకులు మమ్ము, అస్లాంమురాధి ల ఆధ్వర్యంలో పార్టీ బిఎల్‌వోలు , పార్టీ శ్రేణులు కలసి ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్‌ ఫారంలు ఇవ్వడం, భర్తీ చేయడం, వాటిని 2002 ఓటర్ల జాబితాతో సరిచేయడం, దాని ద్వారా ప్రభుత్వ బిఎల్‌వోలకు ఇవ్వడం ఆ ఇంటి ఓటర్లను ఒకే చేయించడం చేపట్టారు. ఎన్నడు లేని విధంగా పార్టీ శ్రేణులు అన్ని వార్డుల్లోను ప్రజలకు దగ్గరుండి ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు ఇంతియాజ్‌, ఆర్‌కె.రామకృష్ణ, రాఘవ, బాలు, లక్ష్మణరాజు, రమణ, మహబూబ్‌బాషా, అయాజ్‌, నయాజ్‌, రేష్మా, ఆసిఫ్‌, అష్రఫ్‌, సాజిదాబేగం, కృపాకర్‌, గౌస్‌, జిమ్‌ ఇర్ఫాన్‌, అజీజ్‌, నూర్‌, జావీద్‌, తేజ, తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

Tags; YSRCP cadres engage in door-to-door outreach regarding SIR.