June 17, 2026
Explore
ఆర్టీసి డిపోలో వినాయకుని ఆలయం ప్రారంభం

ఆర్టీసి డిపోలో వినాయకుని ఆలయం ప్రారంభం

June 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని ఆర్టీసి డిపోలో శ్రీ వినాయకస్వామి ఆలయాన్ని నిర్మించి , విగ్రహాన్ని బుధవారం ప్రతిష్టించారు. డిపో మేనేజర్‌ దినేష్‌ మాట్లాడుతూ ఆర్టీసి ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది సహకారంతో ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, అలంకరించి పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పూజల్లో ఆర్టీసి ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags: Vinayaka temple inaugurated at RTC depot