పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని అన్ని వార్డు సచివాలయాలలోను యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేడేటా పై విచారణ చేసి తుది నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 19న వార్డు సచివాలయాలకు ఆయా ప్రాంత వాసులు హాజరుకావాలెనని కమిషనర్ మధుసూదన్‌రెడ్డి కోరారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాదేశాల మేరకు కుటుంబ సభ్యుల వివరాల డేటాలను 18వ తేదీన వార్డు సచివాలయాలలో ఉంచుతామన్నారు. దీనిని ప్రజలు చూసుకుని ఎలాంటి పొరపాట్లు ఉన్న 19న రాతమూలకంగా సంబంధిత వార్డు కార్యదర్శులకు అందజేసి పొరపాట్లను సరిదిద్దికోవాలని కోరారు. లేనంతట ప్రస్తుతం సర్వేలో సేకరించిన సమాచారాన్ని నిర్ధారించాల్సి ఉంటుందని తెలిపారు.
Tags: Inquiries regarding the unified survey to be held at secretariats on the 19th.