March 22, 2026
Explore
శ్రీసీతాసమేత కోదండరామస్వామి ఆలయం నిర్మాణం

శ్రీసీతాసమేత కోదండరామస్వామి ఆలయం నిర్మాణం

March 22, 2026 | Andhra Pradesh

-30న ప్రారంభం

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని ప్రసన్నయ్యగారిపల్లెలో శ్రీసీతాసమేత కోదండరామస్వామి ఆలయ నిర్మాణం గ్రామస్తులు కలసి చేపట్టారు. ఈనెల 30 న ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. సుమారు రూ.50 లక్షలతో ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. 30న గణపతిపూజతో ప్రారంభించనున్నట్లు తెలిపారు. 31న పూజా కార్యక్రమాలు నిర్వహించి, 1న ఉదయం విగ్రహ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు , పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నవితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి కృపకుపాత్రులుకావాలెనని కోరారు.

Tags: Construction of the Sri Sita-Sameta Kodandarama Swamy Temple