పుంగనూరు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా నూతన డీఈవోగా బాధ్యతలు చేపట్టిన సుబ్రమణ్యంను బుధవారం పలు మండలాలకు చెందిన హెచ్‌ఎంలు కలసి సన్మానించి అభినందించారు. స్థానిక హెచ్‌ఎంలు అశ్వర్థనారాయణ, మహేష్‌నారాయణతో పాటు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి లు డీఈవోను కలిశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని మరింతగా పెంచేందుకు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.
Tags: Chandramohan Reddy met DEO Subrahmanyam as a courtesy call.