చిన్నమండెం ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం మల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పాత వట్టంవాండ్లపల్లి వద్ద శ్రీనివాసపురం రిజర్వాయర్ సమీపంలో మంగళవారం రాత్రి చిరుతపులి సంచారం కలకలం రేపింది. రైతు ఆనంద్‌కు చెందిన ఆవుల మందపై చిరుతపులి దాడి చేయగా, ఒక ఆవు మృతి చెందినట్లు రైతు తెలిపారు.
ఉదయం పశువులను పరిశీలించగా ఆవు మృతదేహంపై చిరుత దాడి చేసిన ఆనవాళ్లు కనిపించాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో పరిసర గ్రామాల రైతులు, పశుపోషకులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుత సంచారాన్ని గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Tags: Leopard on the prowl in Malluru; attacks and kills a cow.