ఒంటిమిట్ట ముచ్చట్లు:
ఒంటిమిట్టలోని కళ్యాణ వేదిక సమీప జాతీయ రహదారిపై బుధవారం ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గాయపడిన మహిళ కొత్తమాధవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను అంబులెన్స్‌లో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, మృతుడు మరియు గాయపడిన మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags;Horrific road accident in Ontimitta; auto-rickshaw driver dies.