June 17, 2026
Explore
పేకాట స్థావరంపై సంబేపల్లి పోలీసులు దాడి, ముగ్గురు అరెస్ట్

పేకాట స్థావరంపై సంబేపల్లి పోలీసులు దాడి, ముగ్గురు అరెస్ట్

June 17, 2026 | Andhra Pradesh

సంబేపల్లె ముచ్చట్లు:

సంబేపల్లె మండల పరిధిలోని మోటకట్ల గ్రామం జగనన్న కాలనీ సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై సంబేపల్లె పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎస్ఐ రవికుమార్ నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి రూ.4,200 నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవికుమార్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే పేకాట, అక్రమ మద్యం, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

Tags: Sambepalli police raid gambling den; three arrested.