రాయచోటి ముచ్చట్లు:
ప్రభుత్వ భూములకు భద్రత కరువవుతోంది. ఈ భూములను ఆక్రమించేందుకు కొందరు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఆక్రమణలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాయచోటి రింగు రోడ్డుకు ఆనుకుని విల్లాస్‌కు వెళ్లే మార్గంలోని సర్వే నంబర్ 447లో ఉన్న 47 సెంట్ల ప్రభుత్వ భూమిలో కొందరు ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకుంటూ పునాదులు వేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే ఈ బోర్డు ఎంతకాలం ఉంటుందోననే సందేహాలు ప్రజా సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.
అలాగే రాయచోటి మండలం మాసాపేట గ్రామంలోని సర్వే నంబర్ 982/1లో 5.83 ఎకరాల రస్తా పోరంబోకు భూమి ఉందని పేర్కొంటూ అధికారులు రెండేళ్ల క్రితం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే ఓ నాయకుడు ఆ భూమిపై కన్నేయడంతో మళ్లీ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
ఇదే మండల పరిధిలోని సర్వే నంబర్ 357/2లో 4.06 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ కూడా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులు సిద్ధమైనప్పటికీ, అనంతరం ఓ నాయకుడు ఆ భూమిని ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రాంతానికి సంబంధించిన హెచ్చరిక బోర్డు ఇప్పటికీ వీఆర్వో కార్యాలయంలో ఒక మూలన పడిఉందని సమాచారం.
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు కొందరు అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై తహసీల్దార్ యామిని స్పందిస్తూ, తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
ప్రభుత్వ భూములకు భద్రత కరువు.. ఆక్రమణలకు అడ్డుకట్ట ఎక్కడ?

Tags: Lack of security for government lands… Where is the check on encroachments?