June 17, 2026
Explore
కార్యకర్తలకు గుర్తింపు, రక్షణ ఉంటేనే పార్టీ బలోపేతం: సుగవాసి

కార్యకర్తలకు గుర్తింపు, రక్షణ ఉంటేనే పార్టీ బలోపేతం: సుగవాసి

June 17, 2026 | Andhra Pradesh

బి.కొత్తకోటముచ్చట్లు:

కార్యకర్తలకు గుర్తింపు, రక్షణ కల్పించినప్పుడే ఏ రాజకీయ పార్టీ అయినా క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం అవుతుందని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు. బి.కొత్తకోటలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమం–అభివృద్ధి విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నాయకులు ఎంత ప్రజాకర్షణ కలిగిన వారైనా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది కార్యకర్తలేనని పేర్కొన్నారు. కార్యకర్తల కష్టాన్ని గుర్తించి పదవులు, కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తే కార్యకర్తలు మరింత ధైర్యంగా పనిచేస్తారని అన్నారు. కార్యకర్తల సంక్షేమం, ఆత్మగౌరవాన్ని కాపాడినప్పుడే పార్టీలు దీర్ఘకాలం బలంగా నిలుస్తాయని సుగవాసి పేర్కొన్నారు.

Tags: The party strengthens only when cadres have recognition and protection: Sugavasi