June 17, 2026
Explore
పెద్దబలిజపల్లిని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి: రామ శ్రీనివాస్

పెద్దబలిజపల్లిని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి: రామ శ్రీనివాస్

June 17, 2026 | Andhra Pradesh

టి.సుండుపల్లిముచ్చట్లు:

టి.సుండుపల్లిమండలం పెద్దబలిజపల్లిని కేంద్రంగా చేసుకుని నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని జనసేన నాయకుడు రామ శ్రీనివాస్, కూటమి నేతలు, గ్రామస్థులు వైఎస్సార్ కడప జిల్లా పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారి ఎం. వెంకటసుబ్బయ్యకు వినతిపత్రం అందజేశారు.

టి.సుండుపల్లి మండలంలోని అగ్రహారం, యేటిగడ్డరాచపల్లె, చెన్నంశెట్టిపల్లె, పెద్దబలిజపల్లె, గుట్టకాడ బలిజపల్లె, మల్లక్కగారిపల్లె, సాంసేనిగడ్డ హరిజనవాడ, గిరిజనవాడ, రవీంద్రనగర్, యల్లారెడ్డిగారిపల్లె తదితర గ్రామాల్లో సుమారు 2,500 నుంచి 3,000 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ గ్రామాలను కలిపి పెద్దబలిజపల్లిని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరారు.

గతంలో ఈడిగపల్లి గ్రామ పంచాయతీ ఏర్పాటుతో ప్రజలకు దూరభారం పెరిగిందని, భౌగోళిక పరిస్థితులు, జనాభా ప్రాతిపదికన పెద్దబలిజపల్లిని ప్రత్యేక పంచాయతీగా, ఎంఫీటీసీ కేంద్రంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఇప్పటికే న్యాయపోరాటం కొనసాగుతోందని పేర్కొన్నారు.

Tags:Peddabalijapalli should be constituted as a new Gram Panchayat: Rama Srinivas