June 17, 2026
Explore
మదనపల్లెలో మహిళ వద్ద గొలుసు చోరీ

మదనపల్లెలో మహిళ వద్ద గొలుసు చోరీ

June 17, 2026 | Andhra Pradesh

మదనపల్లెముచ్చట్లు:

మదనపల్లెలో రోడ్డు పక్కన నడిచి వెళుతున్న మహిళ మెడలో దొంగ బంగారు గొలుసు చోరీకి పాల్పడ్డాడు. మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్న ఘటనపై వన్ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఎగవ కురవంకలో కాపురం ఉంటున్న శ్రీనివాసులు భార్య భార్గవి టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో సాయంత్రం స్థానిక ఆర్ఆర్ వీధికి షాపింగ్ చేయడానికి వెళ్ళింది. షాపింగ్ పూర్తి కాగానే నడుచుకుని ఇంటికి వస్తుండగా, స్థానిక సొసైటీ కాలనీలోకి రాగానే బైకుపై హెల్మెట్ ధరించి వచ్చిన దొంగ భార్గవి మెడలో ఉన్న 24 గ్రాముల బంగారు గొలుసును లాక్కుని వెళ్ళాడు. బాధితురాలు వెంటనే వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో, వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.

Tags:Chain snatched from woman in Madanapalle