June 17, 2026
Explore
అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి త్వరలో శ్రీకారం: చమర్తి

అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి త్వరలో శ్రీకారం: చమర్తి

June 17, 2026 | Andhra Pradesh

అన్నమయ్య ముచ్చట్లు:

అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టనుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్‌మోహన్‌రాజు తెలిపారు. మంగళవారం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ, జవాద్ తుఫాన్ సమయంలో జరిగిన ఘటనతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందన్నారు. బాధితుల పునరావాసానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఐఐటీ చెన్నై, సీడబ్ల్యూసీ నిపుణుల సలహాలతో కొత్త డిజైన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఐదు గేట్లతో పాటు అదనంగా మూడు నుంచి నాలుగు గేట్లు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టంగా ప్రాజెక్టును నిర్మించనున్నట్లు వెల్లడించారు.

Tags: Reconstruction of Annamayya Project to Begin Soon: Chamarthi