రామసముద్రం ముచ్చట్లు:
రామసముద్రం మండలంలోని యంబాడి మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు, కురప్పల్లికి చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు శ్రీకాంత్ (27) ద్విచక్ర వాహనంపై తన గ్రామానికి వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అతడిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Youth injured after being hit by a car