అన్నమయ్య జిల్లాముచ్చట్లు:
ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల సర్టిఫికెట్లలో మార్పులు, చేర్పుల కోసం గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) సుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, గతంలో ఈ గడువు జూన్ 15 వరకు మాత్రమే ఉండేదన్నారు. జడ్పీహెచ్‌ఎంల అభ్యర్థన మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గడువును పొడిగించినట్లు వెల్లడించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి సర్టిఫికెట్లలోని వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని సూచించారు.
Tags: Deadline extended for correcting 10th-grade students’ certificate details.