June 16, 2026
Explore
అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

June 16, 2026 | Andhra Pradesh

– ఐసిడిఎస్ సిడిపిఓ సుగుణమ్మ

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని చిన్నమండెం, సంబేపల్లి, రాయచోటి మండలాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్స్ (ఆయా) పోస్టులకు అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ సుగుణమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా స్థానిక మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్దేశిత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్థుల వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. స్థానిక వివాహిత మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఆమె స్పష్టం చేశారు.

రాయచోటి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని చిన్నమండెం, రాయచోటి, సంబేపల్లి మండలాలలో వివిధ గ్రామాలు, హరిజనవాడలు, బిడికెలలో ఖాళీ పోస్టులకు రిజర్వేషన్లు కేటాయించబడ్డాయి. గ్రామాల వారీగా పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

చిన్నమండెం మండలం

బోరెడ్డిగారిపల్లె (BC-C), తూర్పుపల్లె హరిజనవాడ (SC గ్రూప్-2), తొగటపల్లె (OC), నగిరి హరిజనవాడ (SC గ్రూప్-3), కూతలవాండ్లపల్లె (OC), చిన్నర్సుపల్లె (BC-D), చావిడికుంట (BC-E), కొత్తపేట (EWS), తొట్టికాడ హరిజనవాడ (SC గ్రూప్-2), డి.బలిజపల్లె (OC) వంటి గ్రామాలకు ఆయా పోస్టులు కేటాయించారు.

రాయచోటి మండలం

సైకం వారిపల్లె (HH మైనర్ లోకోమోటర్), దూలవారిపల్లె (BC-D), బొట్లచెరువు (EWS), వడ్డేపల్లి (VH మైనర్ లోకోమోటర్), బోయపల్లె (SC గ్రూప్-3), ఎస్.బలిజిపల్లి (BC-D), వి.కురవపల్లి (EWS), గుంటిమడుగు హరిజనవాడ (SC గ్రూప్-2), సిద్ధారెడ్డిగారిపల్లె (BC-B) తదితర గ్రామాలలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

సంబేపల్లి మండలం

ఆవులవాండ్లపల్లె (OC జనరల్) అంగన్వాడీ వర్కర్ పోస్టు కోసం అవకాశం ఉంది. అలాగే దిగువరాజుగారిపల్లె (OC జనరల్), బాలిరెడ్డిగారిపల్లె (VH మైనర్ లోకోమోటర్), పరకలబండ బిడికి (ST), కొత్తపల్లె బిడికి (ST), ఎర్రదిన్నెల బిడికి (ST), పాపన్నగారిపల్లె (ST), బుర్రవాండ్లపల్లె (BC-D), ఎర్రగుంట్ల (BC-E), కుమ్మరపల్లె (OC), డి.డి. మాదిగపల్లె (SC గ్రూప్-1), పాపిరెడ్డిగారిపల్లె (OC), మోరంకింద వడ్డేపల్లె (OC), మోపురంపల్లె (ST), దండువారిపల్లె (OC), చిన్నపరెడ్డిగారిపల్లె (BC-B), మొరంకిందపల్లె (OC), బుడ్డారెడ్డిగారిపల్లె (EWS), అడవికమ్మపల్లె (OC), అన్నప్పగారిపల్లె (BC-A), ఎగువ మాలపల్లె (SC గ్రూప్-3), జీ. మాలపల్లె (SC గ్రూప్-2) వంటి గ్రామాల్లో పోస్టులు కేటాయించబడ్డాయి.

అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను పూర్తి వివరాలతో సమర్పించాలని అవసరమైన ధృవపత్రాలు జతచేయాలని సిడిపిఓ సుగుణమ్మ సూచించారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరుగుతుందని ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ నియామక ప్రక్రియ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. అర్హులైన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.

Tags; Applications invited for Anganwadi worker and helper posts.