పుంగనూరుముచ్చట్లు:
ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిభిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానం చేయడానికి వచ్చిన దాతలను ఆసుపత్రి డాక్టర్ మధుసూదనచారి అభినందించారు. డాక్టర్ మాట్లాడుతూ ఒక వ్యక్తిచేసే రక్తదానం ద్వారా నలుగురు ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా గర్భిణిస్త్రీలు, ప్రమాదాల్లో తీవ్ర రక్తశ్రావానికి గురైన బాధితులు , అత్యవసర శస్త్రచికిత్సలు చేయించుకునే రోగులకు రక్తంఎంతో అవసరమన్నారు. రక్తం సమయానికి అందుబాటులో ఉంటే ఎన్నో విలువైన ప్రాణాలు రక్షించేందుకు వీలుందన్నారు. రక్తదానం చేసిన ప్రతి దాతకు సర్టిపికెట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అరుణ, మధుబాల, భారతి తదితరులు పాల్గొన్నారు.
Tags: Blood Donation Camp