June 15, 2026
Explore
ఓటర్ల జాబితాపై అవగాహన కలిగి ఉండాలి

ఓటర్ల జాబితాపై అవగాహన కలిగి ఉండాలి

June 15, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని ప్రజలు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరిగిన తక్షణమే వైఎస్సార్‌సిపి బిఎల్‌వోలకు సమాచారం ఇవ్వాలని జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము సూచించారు. సోమవారం ఆయన పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండు, రహమత్‌నగర్‌ ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలను అందజేశారు. మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులను బిఎల్‌వోలుగా నియమించడం జరిగిందన్నారు. బిఎల్‌వోలు తగిన అవగాహన కల్పిస్తారని , ఓటర్లు ఆందోళన చెందవద్దని తెలిపారు. ఎక్కడైన ఓట్ల తొలగింపు జరిగితే పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

Tags: One should be aware of the voters’ list.