పుంగనూరుముచ్చట్లు:
వేరుశెనగ విత్తనాల కోసం రైతులు క్యూకట్టిన సంఘటన సోమవారం పట్టణ సమీపంలోని ఉలవలదిన్నె సచివాలయంలో జరిగింది. వేరుశెనగ విత్తనాలు కావాల్సిన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించడంతో రైతులు క్యూకట్టారు. రైతులు ఉదయం నుంచి వేచిఉన్న సచివాలయంలో నమోదు కార్యక్రమం నిర్వహించలేదని, దీనిపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని నమోదు కార్యక్రమాన్ని సక్రమంగా ఏరియాల వారిగా నిర్వహించాలని కోరారు.
Tags: Farmers queue up for groundnut seeds.