June 15, 2026
Explore
రైస్‌పుల్లింగ్‌ మోసగాళ్లు 6 మంది అరెస్ట్

రైస్‌పుల్లింగ్‌ మోసగాళ్లు 6 మంది అరెస్ట్

June 15, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రైస్‌పుల్లింగ్‌ పేరుతో ప్రజలను మోసగిస్తున్న 6 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సికింద్రాబాద్‌కు చెందిన వెంకటరత్నంకు రూ.50 వేలు మోసం చేసిన కేసులో బాధితులైన నాగిరెడ్డి, అరుద్రయ్య, మహేష్‌కుమార్‌, సయ్యద్‌అదాంబాషా , రెడ్డెప్ప, సంజీవయ్య లను యూఎన్‌ఆర్‌ సర్కిల్‌లో పట్టుకున్నామన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ కెవి.రమణ, సిబ్బంది పాల్గొన్నారు.

Tags; Five ‘rice-pulling’ fraudsters arrested.