జిల్లా యూత్‌వింగ్ కన్వీనర్ చెంగారెడ్డి
పుంగనూరుముచ్చట్లు:
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న గ్రామీణప్రాంత విద్యార్థులకు ప్రతి ఒక్కరు చేయూతనందించాలని జిల్లా యూత్‌వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని నెక్కుంది, బండ్లపల్లె పంచాయతీలలోని ఎలిమెంటరీ పాఠశాలలోని విద్యార్థులకు మిధునన్నదళం క్రింద నోట్‌పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, పెన్నులు, పెన్షిళ్లు , పెన్నుల బాక్సులు, ఎరైజర్లు తదితర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి పేరుతో మిధునన్నదళం అనే ట్రస్ట్ క్రింద ప్రతి ఏటా పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి కలిగించేందుకు క్రీడాటోర్నమెంట్లు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సాయం అంతంతమాత్రంగా ఉందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో పుంగనూరు నియోజకవర్గంలోని వైఎస్సార్‌సిపి శ్రేణులు తమ పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు తమ శక్తి మేరకు సహాయ కార్యక్రమాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి శివకుమార్, సర్పంచ్ నారాయణరెడ్డి, టీచర్లు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Extend a helping hand to government school students.