June 15, 2026
Explore
విద్యార్థుల భద్రతే ప్రాధాన్యం

విద్యార్థుల భద్రతే ప్రాధాన్యం

June 15, 2026 | Andhra Pradesh

ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, స్కూల్ ఆటోలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్..

మదనపల్లి ముచ్చట్లు:

పాఠశాల విద్యార్థుల భద్రతే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఆదేశాల మేరకు రాయచోటి పట్టణంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం రాయచోటి ట్రాఫిక్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో తిరుగుతున్న స్కూల్ ఆటోలపై ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆటో డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్ వంటి కీలక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆశకు పోయి పరిమితికి మించి విద్యార్థులను ఆటోల్లో ఎక్కించి వారి ప్రాణాలతో చెలగాటమాడొద్దని తీవ్రంగా హెచ్చరించారు. ఆటో నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలతో పాటు భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Tags:Student safety is the priority.